యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన 29 వడ్డెర కుటుంబాలు గురువారం వైసీపీలో చేరాయి. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు పాలెపోగు రాంబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రత్యేకించి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాంబాబు చెప్పారు. వైస్ ఎంపీపీ శ్యాంసన్, సర్పంచ్ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.