ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ని మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.