ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సీఐ కార్యాలయం నందు గురువారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన ఆవుల వెంకటేశ్వర్లు ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి 2024 డైరీని అందజేసి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జ్ పీవీ కృష్ణారావు, జిల్లా నాయకులు చిన్నయ్య, వెంకటరమణ, పట్టణ నాయకులు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.