కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పామూరు మెయిన్ బజార్ లో మన ఊరు - మన ఉగ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో పథకాల కరపత్రాలను ప్రతి ఇంటికి, దుకాణాలకు తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయే పనులను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.