ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సర్కిల్ కార్యాలయం నందు నూతన సీఐ గా ఆవుల వెంకటేశ్వర్లు గురువారం భాద్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ భీమా నాయక్ ఒంగోలు బదిలీ కావడంతో ఆ స్థానంలో నూతన సిఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్లోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు సీఐ వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.