రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ(ఎంవోఈఎఫ్) నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖ సందర్శించింది.
మొదట కొండను ఆనుకొని ఉన్న క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బృంద సభ్యులు అక్కడ కొద్ది నిమిషాలు అధికారులతో మాట్లాడారు. రుషికొండపై మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలించి అక్కడి నుంచి తీరం వెంట మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను చూసి వచ్చారు.