ఎపిలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఓటర్ల తొలగింపు వ్యవహారంపై రెండు పార్టీల ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం కలిసి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈసీని కలిసిన వైసీపీ నేతలు ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను చేర్పిస్తోందంటూ ఈసీకి ఫిర్యాదు చేసారు. మరోవైపు టీడీపీ నేతలు ఫారమ్-7 ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.