కర్ణాటకలో అధికార కాంగ్రెస్ బుధవారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించి, అనంతరం బెళగావిలో విందు ఏర్పాటుచేసింది. ఈ విందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్టీ సోమేశేఖర్, శివరామ్ హెబ్బార్, ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ పాల్గొన్నారు. అయితే వీరిపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై గురువారం బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడుతూ.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నుంచి వివరణ కోరుతున్నట్టు తెలిపారు.