సర్కారు వైన్ షాపులోనే మద్యం కల్తీ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఇండియన్ బ్యాంకు పక్కన ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో
కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 1170 కల్తీ మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు.