తిరువేర్కాడులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ‘ద్రావిడ ముర్పోక్కు మున్నేట్ర కళగం’(డీఎండీకే) పార్టీ 18వ సర్వసభ్యమండలి, కార్యనిర్వాహక మండలి సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో మన లక్ష్యం నెరవేరేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.