దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం రికార్డు స్థాయిలో భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 969.55 పాయింట్లు పెరిగి 71,483.75 వద్ద, నిఫ్టీ 274.00 పాయింట్లు పెరిగి 21,456.70 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో TCS, HCL టెక్, ఇన్ఫోసిస్, SBI, టెక్ మహీంద్రా లాభాల్లో ఉండగా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, మారుతీ, ITC షేర్లు క్షీణించాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ఉంది.