ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ కొనసాగింది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధులు కేసులను త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీం కోర్ట్ ఆర్డర్ వేయడంతో.. సుమోటో పిల్‌గా తీసుకొని ప్రజా ప్రతినిధుల కేసులను హైకోర్టు విచారిస్తోంది. హైకోర్టు విచారణ చేస్తున్న సుమోటో పిల్‌తో కలిపి జగన్ కేసుల పిటిషన్‌ను జత పరచాలని రిజిస్ట్రీకి న్యాయస్థఆనం ఆదేశించింది. జగన్‌పై ఉన్న కేసులు విచారణ వచ్చే ఎన్నికలోపు పూర్తి చేయాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇప్పటికి 20 కేసుల్లో డిస్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కోర్టులో సీబీఐ మెన్షన్ చేసింది. జనవరి 5న డిశ్చార్జ్ పిటిషన్లను విచారిస్తామని సీబీఐ కోర్టు చెప్పిందని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. మరో మూడు కేసుల్లో స్టే ఉందని కోర్ట్‌కు సీబీఐ న్యాయవాది చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.