స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 967 పాయింట్లు లాభపడి 71,484కు చేరుకుంది. నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 21,457 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (5.58%), టీసీఎస్ (5.28%), ఇన్ఫోసిస్ (5.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.99%), టాటా స్టీల్ (3.33%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.75%), భారతీ ఎయిర్‌టెల్ (-1.30%), మారుతీ (-0.65%), ఐటీసీ (-0.40%), కోటక్ బ్యాంక్ (-0.18%).