తిరుమల గిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఒక పక్క మంచు తెరలు.. మరోవైపు మంచుతో కూడిన చిరుజల్లులు కురుస్తుండటంతో భక్తులు, ప్రకృతి ప్రేమికులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం చల్లటి వాతావరణంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్వెటర్లు, దుప్పట్లు ధరించారు. రెండు ఘాట్ రోడ్లలో కొండల మధ్యన మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి. ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలకు మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. సొంత వాహనాల్లో కొండపైకి వచ్చిన భక్తులు తమ వాహనాలను ఆపి ప్రకృతి అందాలను సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ సంబరపడిపోతున్నారు.