ఏపీలోని 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జులను ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం మార్పు చేర్పులు చేపట్టారు. ఈ అంశంపై మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇప్పటికి ఆళ్ల మా పార్టీ వాడే. ఎమ్మెల్యేలు ఎవరికీ అసంతృప్తి లేదు..అందరు మా వాళ్లే.. అందరం జగన్ కోసం పని చేస్తాం.. నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేశా..జగన్ బొమ్మ పైనే గెలిచాను..మంత్రిని అయ్యాను.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంతనూలపాడు నియోజకవర్గానికి నన్ను ఇన్చార్జ్గా నియమించారు.. జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటి చేస్తాను.175 నియోజకవర్గాలల్లో వైసీపీనే గెలుస్తుంది..అందులో ఎటువంటి సందేహం లేదు’’ అని మంత్రి నాగార్జున తెలిపారు.