మంత్రి కాకాణి గోవర్ధన్ పై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. నేడు అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాకాణి అక్రమాలకు అధికారులు, పోలీస్ శాఖ వంతపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ - జనసేన పొత్తు రానున్న ఎన్నికల్లో తమను అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాకాణి అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన సోమిరెడ్డి దీక్షకు సమయాభావం వల్ల వెళ్లలేకపోయాను. జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు. వాటిని మేం మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. నెల్లూరులో జనసేన నుంచి మా అభ్యర్థి పోటీ చేస్తారు. వైనాట్ 175 అని వైసీపీ వాళ్లు అంటున్నారు.. వై నాట్ వైసీపీ జీరో అని మేం అంటున్నాం. నియంతృత్వ పోకడలతో వెళ్తున్న సీఎం జగన్ కు ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మేం గెలవబోతున్నాం అని అన్నారు.