ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను ఐరాస భద్రతా మండలి నిషేధించగా తాజాగా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణిని తమ తూర్పు జలాల వైపు ప్రయోగించినట్లుగా గుర్తించామని దక్షిణ కొరియా ఆర్మీ తెలిపింది. అది ఏ క్షిపణి, ఎంత దూరం ప్రయాణించింది అన్నది ద. కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలపలేదు. ఆ మిస్సైల్ తమ ఈఈజెడ్ వెలుపల ల్యాండ్ అయ్యిందని జపాన్ తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.