దేశవ్యాప్తంగా కోవిడ్‌తో తాజాగా ఐదుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం 335 తాజా కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,701 కు పెరిగిందని పేర్కొంది. కోవిడ్‌తో కేరళలో నలుగురు చనిపోగా, యూపీలో మరొకరు చనిపోయారు. ఇక కేరళలో కరోనా కొత్త సబ్-వేరియంట్ JN. 1 కనుగొనబడింది. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.