నమ్మకం, పట్టుదల, కష్టం, విజయం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డీఎన్ఏ అని వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అభివర్ణించారు. నారా లోకేశ్ చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్‌ను కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను. లోకేశ్‌ది పాదయాత్రా.. లేక డైటింగ్ యాత్రా? లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి నోరు విప్పితే బూతు. మాట్లాడితే మటాష్. అడుగు పెడితే.. నాశనం. ఈ మూడు తప్పితే లోకేశ్ యాత్రలో ఏమైనా ఉన్నాయా? అసలు లోకేశ్ పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర ద్వారా ఏమి తెలుసుకున్నావు. నీ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏమి చెప్పదల్చుకున్నావు. చంద్రబాబు 14 ఏళ్లు పాటు సీఎంగా చేశాడు. ప్రతిసారీ చంద్రబాబు ఇస్తాం అంటాడు తప్ప ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.