వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.... జనహృదయ నేత జగనన్న. ఆయన ప్రజల గుండెల్లో ఎంతగా ఉన్నారన్నది ఈ బహిరంగసభలో స్పష్టంగా కనిపిస్తోంది. సమయం ఎంతవుతున్నా పట్టించుకోకుండా, ఈ సభలో ప్రజలందరూ అలాగే ఉన్నారంటే ..జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో సంక్షేమపథకాల వెల్లువ గురించి అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందించే విషయంలోను.. జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వలంటీర్ల వ్యవస్థ, గ్రామసచివాలయాలు జగనన్న సృష్టి. ఈరోజు ఆ వ్యవస్థల గురించి దేశంలో చర్చలు సాగుతున్నాయి. జగనన్న సంక్షేమపథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని, ఆయా రాష్ట్రాల నాయకులు ఆలోచిస్తున్నారంటే.. ఇక్కడ ఎంత సమర్ధపాలన జరుగుతోందో అర్థం చేసుకోవాలి.విద్య,వైద్యం,అధికార పదవుల ద్వారా ఈరోజు మనకు సాధికారత వచ్చింది. ఈరోజు పేదరికం మన పిల్లల పెద్ద చదువులకు అడ్డంకి కాదంటే జగనన్న వల్లనే. కార్పొరేట్‌స్థాయి చదువులు చదువుతున్నారంటే. ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారంటే..ఇది కాదా విద్యా సాధికారత.అలాగే ఆరోగ్యరంగంలోనే విప్లవాత్మకమార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25లక్షల వరకు వైద్యసాయం అందించాలని సీఎం జగనన్న నిర్ణయం తీసుకున్నారు. పేదల గురించి ఇంతకన్నా గొప్పగా ఆలోచించే నాయకుడు మరొకరు ఉన్నారా? మన రాష్ట్రంలో సంక్షేమపథకాలను చూసినా, అభివృద్ధిని గమనించినా జగనన్న సమర్ధపాలన వల్లే. మానవత్వం వల్లనే. మహనీయులు అంబేడ్కర్,ఫూలే, బాబూ జగజ్జీవన్‌రామ్ ఆదర్శాలను..తన ఆశయాలుగా మార్చుకుని పాలన చేస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన బాగుకోసమే అన్నది మరిచిపోకండి అని అన్నారు.