కర్నూలు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గం నలుమూలల నుంచే కాక, పక్క నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున హాజరు కావడం కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్‌కుమార్, మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నాయకుల ఉపన్యాసాలు ఆసక్తికరంగా సాగాయి.