వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... దేశంలో 28 రాష్ట్రాలుంటే సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం జగనన్న. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒకచోటకు వచ్చి మా లీడర్ జగనన్న అని కదం తొక్కుతున్నారు. కేబినెట్‌లో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి జగనన్న సామాజికధర్మం పాటించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఏనాడైనా చేశాడా? నలుగురు బీసీలను జగనన్న రాజ్యసభకు పంపారు. రాజ్యసభ సీటు ఇస్తానని వర్ల రామయ్యను మోసం చేసి కనకమేడల రవీంద్రకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు . బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగనన్న స్పూర్తిగా తీసుకున్నారు. జ్యోతిరావుపూలే లాగా జగనన్న ఆలోచన చేశాడు. జగనన్నను ఎదుర్కోవాలంటే చంద్రబాబు, టీడీపీ చాలదంట. పొత్తులు కావాలంట. నువ్వు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరితో పొర్లాడినా 2024లో వైయస్సార్‌సీపీ జెండా రెపరెపలాడబోతోంది. బీసీలకు పెద్దపీట వేసినందుకు, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు, అగ్రవర్ణ పేదలను ఆదుకుంటున్నందుకు జగనన్నను ఓడిస్తారా? చంద్రబాబు, పవన్ వగైరా ఎవరైనా కట్ట కలిసి వచ్చినా కృష్ణా నదిలో కలిపేయడం ఖాయం. రేపు రాబోయే ఎన్నికలు పేద వాడికి, పెత్తందార్లకు జరిగే యుద్ధం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంతా జగనన్నతో అడుగులు వేద్దాం అని పిలుపునిచ్చారు.