వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.... దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాజిక సాధికారత ఒక నినాదంగానే ఉంది. రాష్ట్రంలో జగనన్న నేతృత్వంలోని ప్రభుత్వంలో సామాజిక సాధికారత ఒక నినాదం కాదు, రాష్ట్ర ప్రభుత్వ నినాదం అని చేసి చూపించారు. దానికి నిదర్శనం ఇవాళ ఈ వేదికపై ఉన్న నేతలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన ఎంతోమంది నాయకులకు అవకాశం కల్పించిన సీఎం జగన్. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను మోసం చేశాడు. పూర్తిగా అణగదొక్కాడు. జగనన్న ప్రభుత్వంలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చేయి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారు. మంత్రివర్గంలో 25 మంది ఉంటే 70 శాతం అంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులుంటే నలుగురు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలే. మైనార్టీ వర్గానికి చెందిన నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన జగనన్న. తన మొదటి కేబినెట్‌లో అవకాశం కల్పించి రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి లేడు. ఎన్నికల కోసం మూడు నెలల ముందు ఒకరికి మంత్రి ఇచ్చాడు. జగనన్న ప్రభుత్వంలో మైనార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. జఖియా ఖానమ్‌ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా చేసిన చరిత్ర జగనన్నది. మైనార్టీల సంక్షేమం కోసం చంద్రబాబు హయాంలో రూ.2,650 కోట్లే ఖర్చు చేస్తే జగనన్న ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో రూ.23,175 కోట్లు ఖర్చు చేశారు. 12 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు మైనార్టీలకు ఇచ్చారు. 100కు పైగా రాష్ట్ర స్థాయి డైరెక్టర్లుగా ఇచ్చారు. వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి దాకా మైనార్టీలను చేయి పట్టుకొని నడిపిస్తున్న వ్యక్తి జగనన్న. ఏకంగా చట్టాన్నిచేసి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగనన్నది. చంద్రబాబుకు 75ఏళ్లు. మనకు మన పిల్లల భవిష్యత్తుకు ఆయన గ్యారెంటీ అని చెబుతున్నారు. మన చెవిలో పూలు పెడుతున్నారు అని అన్నారు.