నందిగామలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర ముగిసింది. నాలుగున్నరేళ్లలో జగనన్న అండతో తాము సాధించిన సామాజిక సాధికారతను నేతలు తమ ప్రసంగాల్లో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, జూపూడి ప్రభాకర్ రావు, కుంబా రవిబాబు, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.