వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ... సామాజిక సాధికారత.. ఇది ఏపీలో ఉన్న ప్రతి పేదవాడి సాధికార యాత్ర. విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, గృహ నిర్మాణం అందిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటున్న జగనన్న. దేశ చరిత్రలో సగానికి సగం ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5 లక్షల కోట్లు పేదలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకున్న జగనన్న. ఒక్కటంటే ఒక్క సంక్షేమాన్ని తీయనని చంద్రబాబు చెబుతున్నారు. అదే నోళ్లతో ఏపి ....శ్రీలంక అయిపోతుందని చెబుతున్న వారే జగనన్న వెనకాల నడిచే పరిస్థితి.* ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. జగనన్న తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థను హేళన చేసిన వారే ఇప్పుడు పాతిక ఇళ్లకు ఒకరిని పెడతామంటున్నారు. అమ్మ ఒడి ఎంత మందికైనా ఇస్తామంటున్నారు. ప్రజలపై ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగనన్న. ఈ అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వమే మళ్లీ రావాలి. సీఎం రోడ్డు, ఆస్పత్రులు, ఆర్డీవో ఆఫీసు, టౌన్ పోలీసుస్టేషన్.. ఇలా నందిగామలో చేసిన అభివృద్ధిని చూడండి. జగనన్న దయ వల్లే ఇలా అభివృద్ధి జరిగింది అని తెలిపారు.