రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండి తిరిగి రాష్ట్రానికి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ భవానీ మాలాధారణ చేసిన సబ్బినేని కిషోర్చౌదరి నిప్పుల గుండంలో నడిచారు. బాపట్ల ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో భవానీ మాతకు అభిషేకాలు, పడిపూజ, నిప్పుల గుండం కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ పాల్గొని కనకదుర్గమ్మకు క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం నిప్పుల గుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.