రైతుల ముసుగులో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు నాలుగేళ్ల పండుగ చేసుకుంటున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వైయస్ఆర్‌సీపీ సామాజిక సాధికార యాత్రలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతు... ఈ దేశం మొత్తం మీద జగన్ గారిని భయపెట్టే వాడున్నాడా?జగన్ గారిని భయపెట్టాలంటే ఎదుటి వ్యక్తీ జగనే అయ్యుండాలి. ఒక తరాన్ని బాగుచేయాలంటే అది జగన్ గారికే సాధ్యం. ఇది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల రాజ్యం..జగన్ గారిని ఓడిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా?చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు..?ఏ ముఖం పెట్టుకుని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఓటేయమంటున్నాడు?దళిత బిడ్డ శిరీషకు వచ్చినన్ని ఓట్లు రాలేదు..వీళ్లు జగన్ గారిని ఓడిస్తారట?ఈసారి స్పీడ్ పెంచి ఫ్యాన్‌ని 175 మీద తిప్పండి అని పిలుపునిచ్చారు.