వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... అంబేద్కర్, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి, బాబూ జగ్జీవన్ రామ్, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి మహనీయులు సామాజిక విప్లవం రావాలని ఉద్యమాలు చేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ సామాజిక విప్లవం అంటే ఏంటో రుచి చూపలేదు. ప్రప్రథమంగా ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాతే సామాజిక విప్లవం జరుగుతోంది. అసమానతలు తొలగి ఈ కులాల అభ్యున్నతి పెరిగింది. ఏపీ చరిత్రలో ఎస్సీలను తేలికగా చూశారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు.. అన్నది ఎవరూ మర్చిపోవద్దు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నమాటలు మరవద్దు. బీసీలంటే బ్యాక్‌బోన్ క్యాస్ట్‌గా తీసుకొచ్చిన జగనన్న. ఏపీలో బీసీలు జడ్జీలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారు. ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారు. రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి పెరిగింది. ధైర్యంగా తెల్లబట్టలు వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నాయకులుగా ఉండటానికి కారణం జగనన్న పనితీరు. చంద్రబాబు ఎస్సీ ఎస్టీలను మింగేశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. చట్టాలను చుట్టాలుగా మార్చుకున్నాడు. మన హక్కులు కాపాడే జగనన్నను మనం కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.