భూ సర్వేల గురించి నారా లోకేశ్‌కు ఏం తెలుసు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఇక్కడ ఉండరని, హైదరాబాద్‌లో ఉంటారని, వారు విజయవాడ నగరంలో కానీ, విశాఖ నగరంలో కానీ శాశ్వత నివాసాలు ఏర్పరుచుకుని అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. భూ సర్వేల కారణంగా గ్రామాల్లో తగాదాలు తగ్గుముఖం పట్టాయని,శాంతి భద్రతల సమస్య అన్నది తలెత్తకుండా ఉందని అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.