బత్తలపల్లి మండలం ముస్టూరులో వెలసిన శ్రీ కాటకోటేశ్వర స్వామి క్షేత్రంలో ధనుర్మాసం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ దేవాలయంలో అశేష భక్త జనం పాల్గొని స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ పూజారి భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.