ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు, మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు.