అంగన్వాడి సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని అంగన్వాడి యూనియన్ నాయకులు తెలిపారు. మంగళవారం కొండాపురంలో అంగన్వాడి కార్యకర్తలు ఏఐటీయూసీ నాయకులు వెంకటరమణ, సుబ్బారావు, సలీమ్ బాషా, ప్రతాప్ జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.