కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రజలకు బయట ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. నిరంతరం క్షిపణి, ఆయుధ పరీక్షలతో అమెరికా దాని మిత్ర దేశాలపై కవ్వింపులకు పాల్పడే కిమ్.. ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో దుర్బర పరిస్థితులు నెలకున్న వేళ.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో నిలిచిపోయిన వోన్సాన్-కల్మా కోస్టల్ టూరిజమ్ జోన్ నిర్మాణాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు న్యూస్‌వీక్ కథనం వెలువరించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బీచ్‌లు, హోటల్స్, ఆకాశహార్మ్యాలతో స్పెయిన్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం బెనిడోర్మ్‌కు పోటీగా నిలుస్తుందని ఆశిస్తోంది. విశాలమైన కాంప్లెక్స్ కోసం నిర్మాణం ప్రారంభించారు. ఇందులో వాటర్ పార్కులు, హోటళ్లు, ఎయిర్‌ఫీల్డ్ ఉంటాయి. రిసార్ట్ వోన్సాన్ ఓడరేవు నగరానికి సమీపంలో ఉంది. కిమ్ జోంగ్-ఉన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌లలో ఒకటి. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2018 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
స్పెయిన్‌లోని కోస్టా బ్లాంకాను సందర్శించిన తర్వాత ఉత్తర కొరియా బ్యూరోక్రాట్‌లకు పర్యాటక ప్రదేశాన్ని తెరవాలనే ఆలోచన వచ్చిందని, ఇది వారిని ఆకర్షించి, ఆకట్టుకుందని మెట్రో నివేదిక తెలిపింది. స్థానికంగా నిరాశ్రయులైన ప్రజలు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానికంగా 'కొట్జెబి' అనే ప్రాంతంలో నివసించినట్లు పేర్కొంది. మానవ వ్యర్థాలు, మంటలు, పొగతో కప్పేసి ఉందని ఉత్తర కొరియా వార్తాపత్రిక డైలీ ఎన్కే నివేదికను ఉదహరించింది. అయినప్పటికీ, వోన్సాన్-కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్ కోసం కిమ్ పెద్ద ప్రణాళికలతో ఉన్నాడని, నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తి చేయడానికి సిద్ధమైనట్టు చెప్పింది. అయితే, పర్యటనలపై నిషేధం, భద్రతా కారణాలతో టూరిస్ట్ జోన్ అక్కడికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను చూసే అవకాశం లేదు. కోవిడ్ -19కి ముందు వేలాది మంది పర్యాటకులు ఉత్తర కొరియాను సందర్శించారు, వారిలో ఎక్కువ మంది చైనా నుంచి వెళ్లినవాళ్లే. కానీ ఇప్పటికీ సరిహద్దులను మూసే ఉంచడంతో ప్రయాణాలను మరింత పరిమితం చేస్తుంది. ‘ఉత్తర కొరియాలోకి, వెలుపలికి వచ్చే అన్ని ప్రయాణీకుల మార్గాలను కిమ్ సర్కారు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆంక్షల కారణంగా ప్యాంగ్యాంగ్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం తాత్కాలికంగా మూసివేయబడింది. దీని అర్థం ఉత్తర కొరియా నుంచి కాన్సులర్ మద్దతు పొందలేరు’ అని యూకే విదేశీ, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.