మద్దిపాడు మండలంలోని ఆవులు, గేదెలలో వచ్చే గొంతు వాపు వ్యాధిపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని మండల పశు వైద్యాధికారి జ్యోతి మంగళవారం తెలియజేశారు. ప్రస్తుత సీజన్ లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రజలే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల పశువులకు జ్వరంతో కూడిన లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశుపోషకులు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు.