మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ధార్, దానికి సమీపంలోని జిల్లాల్లో గ్రామస్తులు రాతి బంతులను పూజిస్తున్నారు. అవి వారికి పొలం పనులు, ఇతర తవ్వకాలు జరిపినపుడు దొరికేవని సమాచారం.
ఈ బంతులను కాకర్ భైరవ్‌గా పూజిస్తున్నట్టు పండ్యాల గ్రామస్తులు తెలిపారు. వాటిపై లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసెన్సెస్ పరిశోధకులు పరీక్షలు చేసి, డైనోసార్ టైటనాసార్ జాతికి చెందిన శిలాజ గుడ్లుగా తేల్చారు.