నారా లోకేష్ యువగళం ముగింపు సభకు ఖరీదైన యాంకర్ పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరూ గుర్తించని యాత్ర అది అని ఎద్దేవా చేశారు. కనీసం లోకేష్ కైనా, పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా? అని ఎద్దేవా చేశారు. లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. లోకేష్‌ది అశుభయాత్ర అని అంటూ విమర్శించారు.