అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎన్నికల విషయంలో కొలరాడో సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మార్చిలో జరగనున్న ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్లో పోటీ చేయకుండా ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది.
2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతు దారులు దాడి చేసిన విషయంలో సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూపు ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈ తీర్పిచ్చింది.