కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక వ్యక్తి 255 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన ఘటన వెలుగుచూసింది. అతడి స్కూటీ పై ఉన్న ఫైన్లను చూసి బెంగళూరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
ఎలుమలై అనే వ్యక్తి పేరు మీద ఉన్న స్కూటీ గత రెండేళ్లలో 255 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రూ.1.34 లక్షల జరిమానా విధించారు. బకాయిలు చెల్లించాలని ఎలుమలైకి అధికారులు నోటీసులు జారీ చేశారు.