యువగళం కాస్తా జనగళంగా మారిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. యువగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ రాబోతున్నారని.. అది మరింత విజయవంతం కావాలని ఆయన కోరారు. చిత్తూరులో చిరుజల్లుగా ప్రారంభంమైన యువగళం పెను తుఫాన్ గా మారి విశాఖ చేరిందన్నారు. నాలుగు రోజులు మాత్రమే నడుస్తారులే అని లోకేష్‌ను వైసీపీ నేతలు హేళన చేశారని రఘురామ అన్నారు. స్టార్టింగ్‌లో మైక్ లాగేశారని.. వాహనం సీజ్ చేశారన్నారు. ఎన్ని అవంతరాలు సృష్జించినా గాంధేయ మార్గంలో లోకేష్ ముందుకు వెళ్లారన్నారు. ‘‘కడపతో సహా లోకేష్ బలాన్ని పెంచుకోని యువగళంగా ముందుకు వెళ్లారు. లోకేష్ యాత్ర చూసి ప్రభుత్వంలో వణుకు మొదలయ్యింది. లోకేష్‌కి హ్యాట్సాఫ్. తండ్రిని అరెస్ట్ చేసినా ముందుకు సాగుతూ వెళ్ళిపోయాడు. నడకతో నడతా మారుతుంది. పాదయాత్రతో చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ ప్రజల మన్ననలు పొందారు. లోకేష్ కూడా ప్రజల మన్ననలు పొందారు. ఎంతో పరిణతితో లోకేష్ అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. లోకేష్‌లో ప్రజలు మంచి నాయకుడిని చూడగలుగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. లోకేష్ యువగళంతో ప్రజాధారణ పొందారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో జగన్ ప్రజాదర్బార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెట్లను నరుకుతూ ముందుకు వెళ్ళాడు. అశోకుడు చెట్లు నాటెను, జగన్మోహన్ రెడ్డి చెట్లు కొట్టెను.10 నెలల యువగళం యాత్రతో నారా లోకేష్ ప్రజలకు దగ్గరయ్యారు. ఈ రోజు లోకేష్ సభ విజయవంతం కాబోతుంది. సభ చరిత్రలో నిలిచిపోనుంది.గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు భద్రత కలిపించారు. కానీ లోకేష్ యాత్రకు జగన్ ఎన్నో అవరోధాలు కల్పించినా ముందుకు వెళ్ళారు. లోకేష్ పీపుల్స్ లీడర్ అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి రెండు కారణాలు గొడ్డలి, కోడికత్తి’’ అని రఘురామ పేర్కొన్నారు.