ఏపీలో రైలు ప్రయాణికులు ముఖ్యమైన గమనిక. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ-కర్నూలు(08585) ప్రత్యేక రైలు జనవరి 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.35గంటలకు విశాఖ నుంచి బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.20గంటలకు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు-విశాఖ(98586) ప్రత్యేక రైలు జనవరి 17, 24, 31 తేదీల్లో మధ్యాహ్నం 3.30గంటలకు కర్నూలు నుంచి బయలుదేరుతుందిన్నారు.
భువనేశ్వర్-తిరుపతి(02809) ప్రత్యేక రైలు జనవరి 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 1.30గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 7.35గంటలకు దువ్వాడ చేరుకుని.. ఇక్కడి నుంచి 7.37గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-భువనేశ్వర్(02810) ప్రత్యేక రైలు జనవరి 14, 21, 28 తేదీల్లో రాత్రి 8.15గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.30గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.