డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెను చూచి సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ అన్నారు. బుధవారం రాజంపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి అగ్నిమాపక కేంద్రం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్డున పడ్డారన్నారు.