జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగిన అంగన్వాడీను ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని, అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని మాజీ మంత్రి, బిజెపి నాయకుడు డా. కామినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పలు సమస్యల పరిష్కారంతోపాటు డిమాండ్ల సాధనకు కైకలూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో అంగన్వాడీలు చేపట్టిన నిరసనకు బుధవారం డా. కామినేని సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చా రు.