భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మిషన్ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ వీడియో ఈఏడాది యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన వీడియోగా రికార్డ్ నెలకొల్పింది.
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని 85 లక్షలకుపైగా వీక్షించారు. 2023 ఏడాదికి సంబంధించి ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన టాప్-15 వీడియోల జాబితాను ‘యూట్యూబ్ ఇండియా’ బుధవారం విడుదల చేసింది.