రాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని సిఎం జగన్ విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో గురువారం మాట్లాడారు.
'రైతు రుణాలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మా పాలనలో రాష్ట్రం అప్పులపాలైందట. మరి బాబు చెబుతున్న ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు?‘ అని జగన్ ప్రశ్నించారు.