ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ గురువారం కలిశారు. ఇద్దరు కుమారులు కుమార స్వామి, రేవణ్ణతో కలిసి ఢిల్లీలో మోదీతో భేటీ అయ్యారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని తెలియజేశారు. దేవెగౌడ చేసిన కృషిని మోదీ ఈ సందర్బంగా కొనియాడారు. వారిని కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.