ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బైరియాహిలో నివసిస్తోన్న ఓ మహిళ కిడ్నీ దానం చేసి ఇరకాటంలో పడింది. ఆ మహిళ సోదరుడికి అనారోగ్యం కారణంగా ఓ కిడ్నీ పాడైంది. దీంతో మహిళ తన కిడ్నీని దానం చేసింది.
ఈ విషయాన్ని సౌదీ అరేబియాలో ఉంటున్న తన భర్తకు తెలిపింది. దీంతో ఆమె భర్త ఆగ్రహానికిలోనై ఫోన్లో వాట్సప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటనతో షాక్ తిన్న మహిళ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.