దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 594గా ఉంది. ఇందులో 300 కేసులు కేరళలోనే ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. కేరళలో ప్రజలు ఆందోళన చెందాల్సినవసరం లేదని, వైరస్ను అడ్డుకునేందుకు ఆస్పత్రులు సిద్ధం చేశామన్నారు.