లోక్సభలో ఇద్దరు దుండగులు కలర్ స్మోక్ తో చేసిన అలజడి తీవ్ర కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ టెకీని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి.
అతడు కర్ణాటక పోలీసు శాఖలో పనిచేసిన ఓ మాజీ ఉన్నతాధికారి కుమారుడు సాయికృష్ణ జగాలి అని పోలీసులు వెల్లడించారు. సాయి దుండగులలో ఒకరైన మనోరంజన్కు స్నేహితుడు. విచారణలో భాగంగా బుధవారం సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.