కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల బిల్లు నియామకం, ప్రక్రియపై లోక్‌సభలో జరిగిన చర్చలో జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని, దొంగ ఓట్లు నమోదవుతున్నాయన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యమని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.