ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా రబీంద్రనాథ్ ఠాగోర్ నగర్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రీల్స్ చూస్తూ చేసిన పనికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
5వ తరగతి చదివే 11 ఏళ్ల బాలుడు గురువారం స్కూలు నుంచి వచ్చి ఫోన్ లో రీల్స్ చూస్తూ ఉన్నాడు. తల్లి స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని ప్రాణాలు కాపాడుకునే టెక్నిక్ ను ప్రయత్నించాడు. అది కాస్త గొంతుకు బిగుసుకోవడంతో ఉరిపడి ఊపిరాడక మృతి చెందాడు.